![]() |
![]() |

బిబి జోడి సీజన్ 2 ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఈ వీక్ జోడీస్ మధ్యన హోస్ట్ ప్రదీప్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఫ్లవర్ అండ్ ఫైర్ అనే ఒక బోర్డుని పెట్టించాడు. "ఎవరు తమ తమ జోడీలకు గట్టి పోటీ ఇస్తారనుకుంటున్నారు ఎవరు ఇవ్వరు అనుకుంటున్నారు" అంటూ ఆ పిక్స్ ని ఆ బోర్డు మీద పెట్టమన్నాడు. దాంతో జోడీస్ అంతా వచ్చారు. అన్ని జోడీలకు గట్టి పోటీ ఇచ్చేది మానస్ అండ్ శ్రష్టి జోడి అంటూ వోట్ చేశారు. ఇక జోడీ కాదు ఫ్లవర్ బ్యాచ్ అంటూ ప్రియాంక సింగ్ - మణికంఠ జోడిని ఫ్లవర్ లో వాళ్ళ పిక్స్ ని పెట్టారు. దాంతో ప్రియాంక ఏడ్చేసింది.
ఇక జడ్జెస్ ప్రియాంక బాధను చూసి మోటివేట్ చేశారు. ఫ్లవర్ లో పిక్ పెట్టినంత మాత్రాన వాళ్లకు డాన్స్ రాదనీ కాదు ఫైర్ లో పిక్స్ పోస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు బెస్ట్ డాన్సర్స్ అని కాదు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే ఫ్లవర్ కాస్త ఫైర్ లా మారొచ్చు అదే కష్టపడకపోతే ఫైర్ లో ఉన్నవాళ్లు కూడా ఫ్లవర్ లా కూడా మారొచ్చు అంటూ జోడీస్ అందరికీ జడ్జెస్ బెస్ట్ విషెస్ చెప్పారు.
ప్రియాంక నువ్వు ఏడవాల్సిన పనే లేదు. కాన్ఫిడెంట్ గా ఉండు హ్యాపీగా ఉండు జర్నీ ఒక్కటే ఇంపార్టెంట్ అవుట్ కం ఏదైనా కానీ అంటూ సదా కూడా ప్రియాంకకు చెప్పింది. ఫైర్ జోడీగా మానస్ - శ్రష్టి వర్మ జోడికి మూడు ఓట్లు, ఫ్లవర్ జోడీగా ప్రియాంక సింగ్ - మణికంఠకు ఐదు ఓట్లు పడ్డాయి. దాంతో ప్రియాంక మొదట కొంచెం బాధపడినా తర్వాత సద, శేఖర్ మాష్టర్ మాటలకూ ఊరుకుంది.
![]() |
![]() |